బరువు తగ్గాలనుకునే వారికి హై-ప్రోటీన్ సలాడ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది కడుపు నిండుగా ఉంచి, అనవసరమైన స్నాక్స్ తినకుండా నియంత్రిస్తుంది. ప్రోటీన్, ఫైబర్ మరియు తాజా కూరగాయల కలయికతో ఇది శరీరానికి శక్తినిస్తూనే కొవ్వును కరిగిస్తుంది.
ప్రతిరోజూ అన్నం లేదా చపాతీలే కాకుండా, ఈ వారం ఈ సలాడ్ ట్రై చేయండి. మీ పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది. దీని తయారీ విధానం ఇక్కడ ఉంది:
కావాల్సిన పదార్థాలు:
- సగం కీరదోస (Cucumber)
- ఒక చిన్న ఉల్లిపాయ
- ఒక చిన్న టమోటా
- ఉడికించిన స్వీట్ కార్న్
- నానబెట్టి, ఉడికించిన శనగలు (Chickpeas)
- 1 స్పూన్ ఆలివ్ ఆయిల్
- కారం, చాట్ మసాలా, ఉప్పు
- డ్రెస్సింగ్ కోసం: 4 పనీర్ క్యూబ్స్, 2 స్పూన్ల పెరుగు, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర.
తయారీ విధానం:
- కూరగాయలు: కీరదోస, ఉల్లిపాయ, టమోటాలను చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేయండి. అందులో ఉడికించిన స్వీట్ కార్న్ కలపండి.
- శనగలు: ఒక పాన్ లో ఆలివ్ ఆయిల్ వేసి అందులో కారం, చాట్ మసాలా వేయండి. ఉడికించిన శనగలను అందులో వేసి ఒక నిమిషం పాటు వేయించండి (రోస్ట్ చేయండి). దీనివల్ల సలాడ్ చాలా రుచిగా ఉంటుంది. వేయించిన శనగలను కూరగాయల గిన్నెలో వేయండి.
- డ్రెస్సింగ్: మిక్సీ జార్ లో పనీర్ క్యూబ్స్, పెరుగు, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర మరియు కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేయండి.
- మిక్సింగ్: ఈ పనీర్-పెరుగు పేస్ట్ ను సలాడ్ గిన్నెలో పోసి బాగా కలపండి. అంతే.. రుచికరమైన ‘రోస్టెడ్ చిక్ పీ సలాడ్’ రెడీ!
ముఖ్య గమనిక: బరువు తగ్గాలనుకునే వారు రాత్రి 7 గంటల లోపే భోజనం పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
