మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బెల్గాంలో ఓ కన్నతల్లే తన 24 ఏళ్ల కుమారుడిని కిరాయి మూకతో దారుణంగా హత్య చేయించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
హత్యకు గురైన యువకుడు విజయ్ నారాయణ్, తన తల్లి మీనా నారాయణ్‌కు, రాకేష్ అనే వ్యక్తికి మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు.
దీంతో ఆగ్రహానికి గురైన తల్లి మీనా, కుమారుడిని అడ్డుతొలగించుకోవాలని పథకం పన్ని, రాకేష్ మరియు అతని అనుచరులతో కలిసి కుట్ర పన్నింది.
పథకం ప్రకారం, విజయ్ను కారులో తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి, ఆ తర్వాత గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు.
అనంతరం మృతదేహాన్ని హైవే పక్కన ఉన్న మురుగుకాలువలో పడేసి పారిపోయిన తల్లి మీనాతో సహా ఆరుగురిని మాల్మారుతి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Leave a Reply