‘అన్ని చమురు-గ్యాస్ కంపెనీలు ఇకపై తప్పనిసరిగా…’ – మిడిల్ ఈస్ట్ సంక్షోభం వేళ భారత ప్రభుత్వం కీలక ఆదేశం

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం వల్ల LNG (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. భారతదేశంలో సహజ వాయువు సరఫరాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అవసర వస్తువుల చట్టం, 1955 (Essential Commodities Act, 1955) సెక్షన్ 3 కింద ఒక కీలక ఉత్తర్వు జారీ చేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలన్నింటికీ వర్తించే ఆదేశం

పెట్రోలియం మరియు సహజ వాయువు (సమాచార సేకరణ) ఉత్తర్వు, 2026 ప్రకారం.. దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ చమురు, గ్యాస్ కంపెనీలన్నీ తమ వద్ద ఉన్న డేటాను తప్పనిసరిగా PPAC (Petroleum Planning & Analysis Cell) కు సమర్పించాలి.

  • ఏ కంపెనీ కూడా ఇది “వ్యాపార రహస్యం” (Commercial sensitivity) అని చెప్పి సమాచారాన్ని దాచడానికి వీల్లేదు.
  • ప్రభుత్వ రంగానికి చెందిన ONGC, GAIL, IOC, BPCL, HPCL లతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన రిలయన్స్, అదానీ గ్యాస్ వంటి చిన్న, పెద్ద కంపెనీలన్నీ ఈ పరిధిలోకి వస్తాయి.
ప్రభుత్వం సేకరించే సమాచారం ఏమిటి?

కంపెనీలు తమ ఉత్పత్తి (Production), దిగుమతి, ఎగుమతి, నిల్వలు (Stock), రవాణా, మరియు వినియోగానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలి. అంటే ఎంత గ్యాస్ ఉత్పత్తి అవుతోంది, ఎంత నిల్వ ఉంది, ఎక్కడికి సరఫరా అవుతోంది అనే పూర్తి లెక్కలు ప్రభుత్వం వద్ద ఉంటాయి.

ఈ నిర్ణయం వెనుక కారణం ఏమిటి?

ఖతార్‌లోని రాస్ లఫాన్ (Ras Laffan) పై దాడి తర్వాత ప్రపంచవ్యాప్త LNG సరఫరా 20% ప్రభావితమైంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (Strait of Hormuz) మూసివేత వల్ల భారత చమురు నౌకల రాకపోకలు కష్టతరమయ్యాయి.

  • దేశంలో అసలు స్టాక్ ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అవసరమైతే ‘రేషనింగ్’ (నియంత్రిత సరఫరా) చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
  • రియల్ టైమ్ డేటా అందుబాటులో ఉంటే, గ్యాస్ కొరత ఏర్పడినప్పుడు ఎక్కడ ముందుగా సహాయం అందించాలో ప్రభుత్వం నిర్ణయించగలదు.

Posted

in

by

Tags: