1980లలో ఇరాన్ జైళ్లలో మరణశిక్ష పడిన కన్యలైన అమ్మాయిల విషయంలో ఒక వింత ఆచారం ఉండేది. వారిని ఉరి తీయడానికి ముందు రోజు రాత్రి జైలు గార్డులు బలవంతంగా ‘పెళ్లి’ చేసుకుని అత్యాచారం చేసేవారు. కన్యలుగా చనిపోతే వారు నేరుగా స్వర్గానికి వెళ్తారనే నమ్మకంతో, “దేవుని శత్రువులు” స్వర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే ఈ క్రూరత్వానికి పాల్పడేవారని మానవ హక్కుల సంస్థలు నివేదించాయి.
ఖమేనీ హయాంలో మహిళల పరిస్థితి: ప్రస్తుత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అధికారంలోకి వచ్చాక ఇరాన్‌లో మహిళల స్థితిగతులు మరింత దిగజారాయి. ఆయన విధించిన కొన్ని వివాదాస్పద నిబంధనలు ఇవి:
- నిర్బంధ హిజాబ్: ఒక్క వెంట్రుక కూడా బయటకు కనిపించకుండా హిజాబ్ ధరించడం తప్పనిసరి. 2022లో దీనిని ఉల్లంఘించిందనే ఆరోపణతో మహ్సా అమిని అనే యువతిని ‘మొరాలిటీ పోలీస్’ అరెస్ట్ చేయగా, ఆమె పోలీసు కస్టడీలో మరణించింది. ఇది పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది.
- సైకిల్ తొక్కడంపై నిషేధం: 2016లో ఖమేనీ ఒక ఫత్వా జారీ చేస్తూ, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో సైకిల్ తొక్కడం పురుషుల దృష్టిని ఆకర్షిస్తుందని, అది సామాజిక పతనానికి దారితీస్తుందని పేర్కొన్నారు.
- విద్యపై ఆంక్షలు: సుమారు 36 విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ వంటి 77 కోర్సుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ రంగాలు మహిళలకు సరిపోవని ప్రభుత్వం వాదించింది.
- తొందరగా వివాహం: అబార్షన్లను వ్యతిరేకిస్తూ, జనాభాను పెంచేందుకు 13 ఏళ్లకే అమ్మాయిలకు పెళ్లి చేయడాన్ని ఖమేనీ సమర్థించారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను కూడా నియంత్రించారు.
అణుబాంబు మరియు ఇతర ఫత్వాలు: అణు ఆయుధాల తయారీ ‘హరామ్’ (నిషిద్ధం) అని ఖమేనీ గతంలో ఫత్వా ఇచ్చారు. అయితే, ఇరాన్ ప్రస్తుతం అణుబాంబు తయారీకి చేరువలో ఉందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికే ఆయన ఆ ఫత్వా ఇచ్చారని విమర్శకులు అంటారు. కేవలం అవయవ దానం విషయంలో మాత్రమే ఆయన సానుకూలమైన ఫత్వా ఇచ్చారు.

Leave a Reply