‘అబ్బాయిలు కూడా సురక్షితం కాదు…’ బస్సులో 70 ఏళ్ల వృద్ధుడి వికృత చేష్ట; వీడియో తీసి ఆవేదన పంచుకున్న యువకుడు

పురుషులపై వేధింపుల ఉదంతం: బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన పట్ల ఒక వృద్ధుడు ప్రవర్తించిన తీరును వివరిస్తూ ఒక యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. 70 ఏళ్ల వృద్ధ ప్రయాణికుడు తనను అసభ్యంగా తాకాడని (Bad touch) ఆ యువకుడు ఆరోపించాడు. “అబ్బాయిలు కూడా ఎప్పుడూ సురక్షితంగా ఉండరు” అని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళల భద్రత గురించి మనం తరచుగా మాట్లాడుకుంటాం, కానీ అబ్బాయిలు సురక్షితమేనా? అనే ప్రశ్నను ఈ వైరల్ వీడియో లేవనెత్తింది. అలిషేక్ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ విషయాన్ని ప్రపంచం ముందుకు తీసుకువచ్చాడు.

70 ఏళ్ల వృద్ధుడిపై ఆరోపణ: అభిషేక్ తన బస్సు ప్రయాణంలో ఎదురైన అనుభవాన్ని వీడియో తీసి షేర్ చేశాడు. తన పక్క సీటులో కూర్చున్న ఒక వృద్ధుడు తన ‘పర్సనల్ బౌండరీ’ దాటి, అసభ్యంగా తాకడానికి ప్రయత్నించాడని అభిషేక్ ఆరోపించాడు. వీడియోలో అభిషేక్ చాలా సంయమనంతో ఆ వృద్ధుడిని ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వయసు అడగగా.. తనకు 70 ఏళ్లు ఉంటాయని ఆ వృద్ధుడు సమాధానమిచ్చాడు.

నేను షాక్‌కు గురయ్యాను: అభిషేక్ తన పోస్ట్‌లో ఇలా రాశాడు- “బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు నా జీవితంలో ఊహించని సంఘటన జరిగింది. ఒక వృద్ధుడు నన్ను తప్పుడు రీతిలో తాకడానికి ప్రయత్నించాడు. నేను పూర్తిగా షాక్‌లో ఉండిపోయాను, చాలా భయం వేసింది. వేధింపులు ఎవరికైనా ఎదురవ్వచ్చు, వయసు లేదా లింగంతో దానికి సంబంధం లేదని ఈ ఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. అబ్బాయిలు కూడా ఎప్పుడూ సురక్షితం కాదు.”

కండక్టర్ తక్షణ స్పందన: ఈ విషయంలో బస్సు సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అభిషేక్ తాను తీసిన వీడియోను కండక్టర్‌కు చూపించి విషయం వివరించగా, కండక్టర్ వెంటనే జోక్యం చేసుకున్నాడు. నిందితుడైన ఆ వృద్ధుడిని వెంటనే బస్సులో నుండి కిందకు దించేశారు.

సోషల్ మీడియా మద్దతు: ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అభిషేక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మౌనంగా భరించకుండా గొంతు ఎత్తినందుకు, పరిస్థితిని ప్రశాంతంగా చక్కదిద్దినందుకు అతనిని అభినందిస్తున్నారు. “మీరు చాలా పరిణతితో (Maturity) ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు” అని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించగా.. “వేధింపులు అనేవి కేవలం మహిళలకే కాదు, పురుషులకు కూడా ఎదురవుతాయని సమాజం గుర్తించాలి. తప్పు ఎవరు చేసినా ఎదురుతిరగడం అవసరం” అని మరొకరు రాశారు.


Posted

in

by

Tags: