మహారాష్ట్రలోని మెట్రో వంతెన సమీపంలో, నిర్మాణ పనులు జరుగుతుండగా పైనుంచి ఓ పెద్ద సిమెంట్ రాయి పడి షాదాబ్ (23) అనే యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
రోడ్డు దాటుతున్న సమయంలో మొబైల్‌కు కాల్ రావడంతో షాదాబ్ కొద్ది క్షణాలు అక్కడే ఆగాడు. ఆ సమయంలో అనూహ్యంగా పైనుంచి పడిన సిమెంట్ రాయి నేరుగా అతని తలపై బలంగా తాకడంతో, అతను కుప్పకూలి రోడ్డుపై పడిపోయాడు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపి ఉంచడంతో, గాయపడిన షాదాబ్ సుమారు గంట పాటు ఎవరి కంటా పడకుండా రక్తపు మడుగులో అలాగే పడి ఉన్నాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి అతడిని గమనించి, వెంటనే చికిత్స నిమిత్తం వొకార్డ్ (Wockhardt) ఆసుపత్రిలో చేర్పించాడు.
ప్రస్తుతం తలకు తీవ్ర గాయాలైన షాదాబ్‌కు ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో కనీస భద్రతా చర్యలు లేకుండా మెట్రో పనులు చేపట్టడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply