సౌదీ అరేబియాలోని ‘ప్రిన్స్ సుల్తాన్’ ఎయిర్ బేస్‌పై ఇరాన్ జరిపిన క్షిపణి మరియు డ్రోన్ దాడులు అమెరికా వైమానిక దళానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. మార్చి 27న జరిగిన ఈ దాడిలో యూఎస్ ఎయిర్ ఫోర్స్ వెన్నెముకగా భావించే E-3 Sentry AWACS (ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) విమానం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ విమానం విలువ సుమారు 700 మిలియన్ డాలర్లు (దాదాపు ₹6,000 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.
సౌదీ అరేబియాలో మోహరించిన అమెరికా విమానాలు: మీడియా నివేదికల ప్రకారం, ఈ విమానం సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ ఎయిర్ బేస్‌లో ఉంది. అక్కడే ఉన్న అమెరికాకు చెందిన మరికొన్ని చమురు ట్యాంకర్ విమానాలు కూడా ఈ దాడిలో దెబ్బతిన్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫోటోలలో ‘AWACS’ విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడిలో 10 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు.
అమెరికా ఇంకా ధృవీకరించలేదు: అమెరికన్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) దీనిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సైనిక వర్గాల సమాచారం ప్రకారం, ఇది యుద్ధంలో అమెరికాకు ఎదురైన మొదటి పెద్ద నష్టం. బోయింగ్ 707 బాడీపై 360 డిగ్రీల రాడార్‌ను కలిగి ఉండే ఈ E-3 Sentry విమానం, గాలిలోనే ఒక ‘కమాండ్ సెంటర్’లా పనిచేస్తుంది. శత్రువుల కదలికలను ముందే పసిగట్టి యుద్ధ విమానాలను సమన్వయం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ విమానం కోల్పోవడం వల్ల మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలగవచ్చు.
