అమెరికాలో మళ్లీ ‘షట్‌డౌన్’: గతంలో 43 రోజులు.. ఇప్పుడు మళ్లీ ఎందుకు నిలిచిపోయిన ఫండింగ్ బిల్లు?

అమెరికా: అమెరికాపై మరోసారి ‘షట్‌డౌన్’ నీడలు కమ్ముకున్నాయి. సెనెట్‌లో ఫండింగ్ బిల్లు ఆగిపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ ఆందోళనలో ఉన్నారు. గతంలో జరిగిన 43 రోజుల షట్‌డౌన్ నుండి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, ఈ తాజా ‘పాక్షిక షట్‌డౌన్’ సమస్యలను మరింత తీవ్రతరం చేసేలా కనిపిస్తోంది.

ఎందుకు అగిపోయింది?: ప్రభుత్వ ఏజెన్సీల నిర్వహణకు అవసరమైన నిధుల ఒప్పందంపై సెనెట్‌లో వివాదం నెలకొంది. కొంతమంది ఎంపీలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించడంతో రిపబ్లికన్ పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనివల్ల నిధుల కొరత ఏర్పడి షట్‌డౌన్ విధించాల్సి వచ్చింది.

ప్రభావితమయ్యే రంగాలు: ఫండ్స్ లేకపోవడం వల్ల రక్షణ, విద్య, ఆరోగ్యం, రవాణా, మరియు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ వంటి కీలక శాఖల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ శాఖలు మొత్తం బడ్జెట్‌లో 3/4 వంతు కంటే ఎక్కువ ఖర్చు చేస్తాయి. ఇప్పుడు నిధులు అందక వీటి కార్యకలాపాలు ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఉద్యోగుల పరిస్థితి: షట్‌డౌన్ వల్ల లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు సెలవు ఇచ్చి పంపించే అవకాశం ఉంది, మరికొందరు వేతనం లేకుండానే పనిచేయాల్సి వస్తుంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, టీఎస్ఏ అధికారులు జీతం లేకుండానే విధులకు హాజరు కావాలి. దీనివల్ల విమాన ప్రయాణాల్లో జాప్యం లేదా రద్దులు జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు దెబ్బతిని దేశ ఆర్థిక వ్యవస్థపై బిలియన్ల డాలర్ల భారం పడే అవకాశం ఉంది.


Posted

in

by

Tags: