అమెరికా తర్వాత ఈ ముస్లిం దేశం షాక్.. 4 రకాల ఉద్యోగాలపై నిషేధం; భారతీయులకు ‘ప్రీ-వెరిఫికేషన్’ తప్పనిసరి!

వీసా మరియు ఉద్యోగాల విషయంలో అమెరికా విదేశీయులకు షాక్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు సౌదీ అరేబియా కూడా తన ‘విజన్ 2030’ (Vision 2030) పథకంలో భాగంగా ఉద్యోగ మరియు వర్క్ వీసా నిబంధనలలో కీలక మార్పులు చేసింది.

స్థానిక పౌరులకు ఉపాధిలో ప్రాధాన్యత ఇవ్వడం (Saudization) మరియు పని నాణ్యతను పెంచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త కఠిన నిబంధనల ప్రకారం, నాలుగు కీలక వృత్తులను కేవలం సౌదీ పౌరుల కోసం మాత్రమే కేటాయించారు.

ఏయే ఉద్యోగాలపై ప్రభావం? ప్రభుత్వ లేబర్ పోర్టల్ ‘ఖివా (Qiwa)’ ద్వారా ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం ఇకపై ఈ క్రింది పదవుల్లో విదేశీయులను నియమించడం లేదా వారి హోదాలను మార్చడం సాధ్యం కాదు:

  1. జనరల్ మేనేజర్
  2. సేల్స్ ప్రతినిధి (Sales Representative)
  3. మార్కెటింగ్ స్పెషలిస్ట్
  4. ప్రొక్యూర్‌మెంట్ మేనేజర్ (Procurement Manager)

అంటే, ఈ నాలుగు పదవుల్లో విదేశీయుల ఎంట్రీ మూసుకుపోయింది. ప్రస్తుతం జనరల్ మేనేజర్లుగా పనిచేస్తున్న విదేశీయులు కొన్ని షరతులతో ‘సీఈఓ’ లేదా ‘చైర్మన్’ వంటి హోదాలకు మారాలని సూచించారు. మార్కెటింగ్ విభాగంలో కనీసం 60 శాతం మంది సౌదీ పౌరులే ఉండాలి.

కనీస వేతనం నిబంధన: కొత్త నిబంధనల ప్రకారం, సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాల్లో పనిచేసే సౌదీ ఉద్యోగులకు నెలకు కనీసం 5,500 సౌదీ రియాల్స్ జీతం ఇవ్వాలి. టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ రంగాల్లో అయితే కనీసం 8,000 రియాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.

భారతీయులకు తప్పనిసరి అర్హత ధృవీకరణ: జనవరి 2025 నుండి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయ కార్మికులు తమ విద్యా మరియు వృత్తిపరమైన డిగ్రీలను ముందే ధృవీకరించుకోవాలి (Pre-verification). విదేశీయులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశ యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే తమ లక్ష్యమని సౌదీ కార్మిక మంత్రి అహ్మద్ అల్-రజహీ తెలిపారు.


Posted

in

by

Tags: