“అమ్మపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి 3 ఏళ్ల బుడతడి ఫిర్యాదు!” నవ్వు ఆపుకోలేకపోయిన పోలీసులు… నెట్టింట ఫుల్ వైరల్!

తన తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఒక మూడేళ్ల చిన్నారి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లి, “మా అమ్మను వెంటనే జైల్లో పెట్టండి” అంటూ ముద్దుముద్దు మాటలతో మొరపెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చాక్లెట్ కావాలని మారాం చేయడంతో తల్లి తిట్టి కాస్త గట్టిగా మందలించింది. దాంతో తీవ్ర కోపం తెచ్చుకున్న ఆ బుడతడు.. నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడున్న పోలీసులతో, “మా అమ్మ నా చాక్లెట్ లాక్కుంది, నన్ను కొట్టింది… వెంటనే అమ్మను తీసుకెళ్లి జైల్లో వేయండి” అంటూ బోసినవ్వుల అమాయకత్వంతో ఫిర్యాదు చేశాడు.

చిన్నారి మాటలు విని అక్కడున్న పోలీసులంతా నవ్వు ఆపుకోలేకపోయారు. అనంతరం ఒక మహిళా పోలీస్ అధికారి పేపర్‌పై ఫిర్యాదు రాసుకుంటున్నట్లు నటిస్తూ.. ఆ బుడ్డోడికి నచ్చజెప్పి ఇంటికి పంపించారు. పోలీసుల పని ఒత్తిడిని సైతం దూరం చేసి నవ్వులు పూయించిన ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags: