“అమ్మబాబోయ్.. చూడటానికే భయంగా ఉంది.” గుఱ్ఱాన్ని కొట్టి ఈడ్చుకెళ్లిన పులి.. కేకలు వేసిన పర్యాటకులు.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో..!!

(ఉత్తరాఖండ్) రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లా రామానగర్ సమీపంలోని గర్జియా ప్రాంతంలో, జాతీయ రహదారి 309కి అతి సమీపంలో పగటిపూట ఒక పులి జనావాసాలలోకి చొరబడింది.

మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో జనం సంచారం ఎక్కువగా ఉండే సస్పెన్షన్ బ్రిడ్జ్జం క్షన్ సమీపంలో మేత మేస్తున్న ఒక గుర్తిని ఆ పులి క్రూరంగా దాడి చేసి చంపింది. ఆ తర్వాత, మృతి చెందిన గుర్రం కళేబరాన్ని అటవీ ప్రాంతం వైపు ఈడ్చుకెళ్లిన దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు తమ కెమెరాలలో బంధించగా, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజలు మరియు పర్యాటకులు తిరిగే ప్రాంతంలో పులి దాడి చేయడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. ఈ సంఘటన నేపథ్యంలో రామానగర్ అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో గస్తీని (పెట్రోలింగ్) మరింత కఠినతరం చేశారు. పులి సంచారం ఉన్నందున ప్రజలు, పర్యాటకులు అటవీ ప్రాంతానికి మరియు వేలాడే వంతెన సమీపానికి వెళ్లవద్దని, పిల్లలను ఇళ్లలోనే సురక్షితంగా ఉంచాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Posted

in

by

Tags: