దక్షిణాఫ్రికాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన ఓ ఒళ్లు గగుర్పొడిచే వైల్డ్‌లైఫ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది.
ఆ వీడియోలో, తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఓ భారీ సింహం లగ్జరీ ఎస్‌యూవీ (SUV) కారు వెనుక టైరును లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం కనిపిస్తుంది. కోపంతో ఊగిపోయిన ఆ మృగరాజు, తన పూర్తి బలాన్ని ఉపయోగించి కారు పక్కనే నిలబడి టైరును కొరికి నమిలేస్తున్న దృశ్యాలు చూసేవారికే వణుకు పుట్టించేలా ఉన్నాయి.
అదే సమయంలో, ఏమాత్రం భయం లేకుండా సింహానికి అత్యంత సమీపంలోకి వెళ్లి, కారును నెమ్మదిగా ముందుకు నడపాలని డ్రైవర్‌కు ఓ వ్యక్తి సూచిస్తున్న దృశ్యం కూడా వీడియోలో రికార్డైంది. ఇంతటి సాహసం చేసిన వ్యక్తి ప్రముఖ వన్యప్రాణి ప్రేమికుడు, కంటెంట్ క్రియేటర్ అయిన ‘డీన్ షెయిడర్’ (Dean Schneider). ఆ సింహాలు తనను తమ కుటుంబ సభ్యుడిలా భావిస్తుండటంతో, వాటితో అంత సన్నిహితంగా ఉండే చనువు ఆయనకు ఏర్పడింది.
డీన్ షెయిడర్‌పై సింహం ఎలాంటి దాడి చేయనప్పటికీ, కోపంతో రగిలిపోయిన ఆ సింహం కారు టైరును క్షణాల వ్యవధిలోనే కాగితంలా కొరికి పీకిపారేసింది. ఎంతటి అత్యాధునిక, పటిష్టమైన భద్రత కలిగిన పెద్ద వాహనాలైనా సరే.. అడవికి అసలైన రాజు అయిన వన్యప్రాణుల సహజ బలం ముందు ఎంత బలహీనమైనవో ఈ సంఘటన స్పష్టంగా నిరూపించింది.

Leave a Reply