జిమ్లో వ్యాయామం పూర్తి చేసిన ఒక మహిళ, తాను ఉపయోగించిన బరువులను (డంబెల్స్) నేలపైనే అలాగే పడేసి వెళ్లిపోవడానికి సిద్ధమైంది.
అక్కడే ఉన్న ఒక వ్యక్తి దీన్ని గమనించి, ఆ బరువులను ఎక్కడినుంచి తీసుకుందో అక్కడే సరిగ్గా పెట్టాలని ఆ మహిళను కోరాడు.
కానీ, ఆ మహిళ అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయింది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి, అకస్మాత్తుగా ఆ మహిళను పట్టుకుని కోపంగా తోసేసి, ఆమె ముఖంపై రెండుసార్లు బలంగా పిడిగుద్దులు కురిపించాడు.
జిమ్లో జరిగిన ఈ షాకింగ్ ఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేయగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply