“అయ్యో.. అమ్మ లేని లోకంలో నేనెందుకు బతకాలి?”.. తల్లి మరణించిన దుఃఖంలో 19 ఏళ్ల కొడుకు ఆత్మహత్య.. హైదరాబాద్‌ను కుదిపేసిన విషాదం.!!

హైదరాబాద్‌కు ఉపాధి కోసం వలస వచ్చిన చోట భర్తతో తలెత్తిన గొడవల కారణంగా పెద్దమ్మ (45) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషాద వార్త తెలియగానే, తల్లిపై అపారమైన ప్రేమాభిమానాలు కలిగిన 19 ఏళ్ల కుమారుడు ప్రవీణ్ తీరని శోకసంద్రంలో మునిగిపోయాడు.

తల్లి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్, కోలపల్లి గ్రామ శివార్లలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే రోజు తల్లి, కొడుకు ఒకరి తర్వాత ఒకరు తనువు చాలించిన హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మక్తా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఈ కుటుంబంలో.. ఒకేసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం కోలుకోలేని విషాదంలో కూరుకుపోయింది.


Posted

in

by

Tags: