“అయ్యో ఎంత దారుణం.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపేస్తుందా? సొంత కూతురే చేసిన కిరాతకం.. షాకింగ్ ఘటన..!!”

రాజస్థాన్: జైపూర్‌లో 45 ఏళ్ల నీరజ్ అనే మహిళను ఎస్‌యూవీ (SUV) కారుతో వేగంగా వచ్చి కావాలనే ఢీకొట్టి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రారంభంలో ఇది ఒక సాధారణ ప్రమాదంగా భావించినప్పటికీ, అక్కడి సిసిటివి (CCTV) దృశ్యాలను పోలీసులు పరిశీలించగా, ఇది ప్రమాదం కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం కూలీలతో చేయించిన హత్య అని తేలింది. ఈ పథకం ప్రకారం జరిగిన హత్యను మరెవరో కాదు, బాధితురాలి సొంత కుమార్తెనే చేయించడం జైపూర్ వాసులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ప్రభుత్వ ఉద్యోగం మరియు ఆస్తి వివాదాల కారణంగా, చనిపోయిన నీరజ్ కుమార్తె ఆయుషి శర్మ తన తల్లిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. దీనికోసం తన బంధువులతో కలిసి, సుమారు రూ. 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులను పురమాయించి కారుతో తొక్కించి హత్య చేయించింది.

ఈ షాకింగ్ ఘటనలో సంబంధం ఉన్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘోర హత్యకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బల్‌రామ్ (రవి) పరారీలో ఉండగా, అతడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags: