ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో, మత్తు మైకంలో పడి ఉన్న ఒక యువకుడి తలపై మరొక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తూ నవ్వుతున్న షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తీవ్ర కలకలాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ రోత పుట్టించే అసహ్యకరమైన చర్యకు పాల్పడిన వ్యక్తి, బాధితుడిని అవమానించేలా దానిని వీడియో కూడా తీశాడు.
ఆ వీడియోలో, మూత్ర విసర్జన చేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఒక బాటిల్లోని నీళ్లను బాధితుడి తలపై పోసి కడగడం కూడా రికార్డయ్యింది. ఈ దారుణ ఘటన జరిగి దాదాపు 20 రోజులు అయి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింది.
ఇంటర్నెట్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా కాన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని గుర్తించి, అతడిని త్వరలోనే అరెస్టు చేయడానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply