“అయ్యో.. ఏం దారుణమిది! ఫోన్ పగిలిపోయినా పర్వాలేదు, రీల్సే ముఖ్యం..”: మెట్రోలో షాకింగ్ సంఘటన.. కఠిన ఆదేశాలు జారీ చేసిన యాజమాన్యం.!!

ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల ఫుడ్ డెలివరీ బాయ్ శుభమ్ ప్రజాపతి, అతివేగంగా వచ్చిన లగ్జరీ SUV కారు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు.

శుక్రవారం రాత్రి బాంద్రా రిక్లమేషన్ ప్రాంతంలో డెలివరీ కోసం వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో శుభమ్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని బాబా ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స ఫలించక శనివారం తెల్లవారుజామున ప్రాణాలు విడిచాడు.

కారు నడుపుతున్న దక్షిణ ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుమారుడు యువరాజ్ బహేతి (28)ని బాంద్రా పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడిపినందుకు అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, అనంతరం అతనికి బెయిల్ మంజూరైంది.


Posted

in

by

Tags: