ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలతో కలిసి దుకాణానికి వెళ్లాడు. అంతా సాధారణంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో అక్కడ మంటలు చెలరేగి భయానక పరిస్థితి నెలకొంది.
ఈ అనూహ్య ఘటనతో అక్కడున్నవారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక కొందరు దూరంగా నిలబడి చూస్తుండిపోయారు.
అయితే, అదే సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి మాత్రం తన ప్రాణాల గురించి ఆలోచించకుండా వెంటనే రంగంలోకి దిగాడు. మంటలు, ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్లి.. ఆపదలో చిక్కుకున్న తండ్రిని, ఇద్దరు చిన్నారులను చాకచక్యంగా రక్షించాడు.
ఆ వ్యక్తి చూపిన సమయస్ఫూర్తి, అసాధారణ ధైర్యంతో ముగ్గురూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఎదురైన వేళ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వారిని కాపాడిన అతడి సాహసం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈ ధైర్యవంతుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
