మహారాజ్గంజ్ సమీపంలో, కుటుంబ కలహాల కారణంగా కాల్వలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను.. ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ప్రాణాలతో రక్షించారు.
ఈ ఘటన నిచ్లౌల్ – సిస్వా రహదారిలోని నారాయణి కాల్వ సాత్పంచ్ వంతెన సమీపంలో చోటుచేసుకుంది.
బాధిత మహిళ కోఠీభార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెహ్దా గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆమె చాలాసేపు వంతెనపైనే నిలబడి ఉండి, ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాల్వ నీటిలోకి దూకేసింది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న మసిహ్ సేవాశ్రమ్ హయ్యర్ సెకండరీ పాఠశాలకు చెందిన కృష్ణ గుప్తా, సద్దాం హుస్సేన్ అనే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు.. ఆ మహిళ నీటిలో మునిగిపోతుండటం చూసి క్షణం కూడా ఆలోచించకుండా కాల్వలోకి దూకి ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. విద్యార్థుల ఈ ధైర్యసాహసాలను స్థానిక పోలీసులతో పాటు ప్రజలు, నెటిజన్లు విశేషంగా కొనియాడుతున్నారు.
