బీహార్లోని చాప్రా పట్టణానికి చెందిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్, దుకాణదారుడి వద్ద తనకు రావాల్సిన మిగిలిన రూ.15 చిల్లర అడిగినందుకు.. ఆయన చెవిలో కత్తితో పొడిచిన భయానక ఘటన వెలుగుచూసింది.
పాలు కొనుగోలు చేసిన దుకాణంలో మిగిలిన చిల్లర అడగడమే ఈ దాడికి కారణమైంది.
దాడికి గురైన ప్రొఫెసర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారైన నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. స్వల్ప మొత్తం కోసం జరిగిన ఈ కిరాతక దాడిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.
