అయ్యో ఘోరం.! ర్యాలీలో వెళ్తున్న ఎంపీ కారును చుట్టుముట్టిన గుంపు.. అకస్మాత్తుగా జరిగిన రాళ్ల దాడి. పగిలిపోయిన కారు అద్దాలు.. ప్రాణాపాయం ఉందంటూ ఎంపీ సంచలన ఫిర్యాదు.!!!!

గణపతి విగ్రహ నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ లక్ష్మీకాంత్ అలియాస్ పప్పు నిషాద్ కారుపై కొందరు రాళ్లు రువ్విన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తన ప్రాణాలకు ముప్పు కలిగించేలా దాడి జరిగిందని ఎంపీ ఆరోపించారు.

ఈ ఘటన రాత్రి సమయంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీ తన ఇంటికి తిరిగి వెళ్తుండగా, అమర్‌టోపా కూడలి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

డీజేను తరలించేందుకు పోలీసులు ప్రయత్నం

గణపతి నిమజ్జన ఊరేగింపు అమర్‌టోపా కూడలి వద్దకు చేరుకున్న సమయంలో అక్కడ డీజే సంగీతం వినిపిస్తోంది. డీజేను పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, కొందరు అందుకు వ్యతిరేకంగా రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఎంపీ కారు అటుగా వెళ్లింది. దీంతో కొందరు ఆందోళనకారులు కారును చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో కారు అద్దాలు పగిలిపోవడంతో పాటు వాహనం కూడా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఘటన అనంతరం ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఉన్నతాధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి వారితో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

తన ప్రాణాలకు ముప్పు కలిగించేలా దాడి చేసేందుకు ప్రయత్నించారని ఎంపీ లక్ష్మీకాంత్ నిషాద్ ఆరోపించారు. పోలీసులు తనను సురక్షితంగా కారు నుంచి బయటకు తీసుకెళ్లారని, ఆ తర్వాత తాను మార్కెట్ ప్రాంతం వైపు పరుగెత్తుకుంటూ వెళ్లినట్లు ఆయన తెలిపారు.

అఖిలేష్ యాదవ్ విమర్శలు

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మరోవైపు, ఎంపీ నుంచి ఫిర్యాదు అందిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. నిందితులను గుర్తించిన అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


Posted

in

by

Tags: