“అయ్యో ఘోరం! సొంత ఊరికి వెళ్లిన చోట ఇలా జరగాలా..?” దీపావళి రాత్రి నదిలోకి దూసుకెళ్లిన కారు.. జర్నలిస్టుతో సహా కుటుంబమంతా బలి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో..!!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలోని రాజీమ్ తిల్లా డ్యామ్ (అనకట్ట) ప్రాంతంలో దీపావళి పండుగ రాత్రి జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

రాయ్‌పూర్ నుంచి తమ సొంత ఊరికి దీపావళి జరుపుకోవడానికి కారులో బయలుదేరి వెళ్తుండగా, ఊహించని విధంగా కారు అదుపు తప్పి తిల్లా డ్యామ్ నదిలో తలకిందులుగా పడిపోయి ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సీనియర్ జర్నలిస్టు శీతల్ సాహు, ఆయన భార్య భారతి, 19 ఏళ్ల కుమారుడు వికాష్, 21 ఏళ్ల కుమార్తె పూర్వ.. నలుగురూ దయనీయంగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఘటనా స్థలానికి చేరుకున్న గరియాబంద్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కరణ్ ఉయికే నేతృత్వంలోని పోలీసులు, నదిలో మునిగిపోయిన మృతదేహాలను వెలికితీసి తదుపరి చట్టపరమైన చర్యల (పోస్ట్‌మార్టం) నిమిత్తం చంపారన్ ప్రాంతానికి తరలించారు.

మృతి చెందిన శీతల్ సాహు మీడియా రంగంలో పనిచేసిన వ్యక్తి అని, ఆ వాహనంపై మీడియా ఎగ్జిక్యూటివ్ అనే బోర్డు ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు.. ఈ ప్రమాదానికి గల కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *