గుజరాత్ రాష్ట్రం వడోదర సమీపంలోని 48వ జాతీయ రహదారిపై ఉన్న సీఎన్జీ బంక్లో, ఓ కారులో ఇంధనం నింపుతుండగా అకస్మాత్తుగా దాని సిలిండర్ పేలిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
జిందాల్ కంపెనీ సమీపంలోని పెట్రోల్ బంక్లో ఆగి ఉన్న కారుకు సిబ్బంది ఇంధనం నింపుతున్న సమయంలో.. ఊహించని విధంగా సాంకేతిక లోపం లేదా అధిక ఒత్తిడి కారణంగా కారు సీఎన్జీ ట్యాంక్ భయంకరమైన శబ్దంతో పేలిపోయింది.
ఈ పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కారు విడిభాగాలు, అద్దాలు చాలా దూరం వరకు ఎగిరిపడ్డాయి. అంతేకాకుండా, పక్కనే ఆగి ఉన్న మరో రెండు వాహనాల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.
అదృష్టవశాత్తూ, సీఎన్జీ నింపుతున్న సమయంలో ప్రయాణికులందరినీ కారు దిగి బయట నిలబడాలని సిబ్బంది ముందే సూచించడంతో.. ఈ ఘోర ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, తీవ్ర గాయాలు గానీ జరగలేదు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కర్జన్ అగ్నిమాపక సిబ్బంది, హైవే పోలీసులు.. మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకుని పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

Leave a Reply