అయ్యో.! చూస్తుంటేనే గుండె గుభేలుమంటోంది.! ఇంటి ముందు ఉన్న చిన్నారి. కార్ చక్రాల కింద చిక్కుకుని తల్లడిల్లిన విషాదం. కేకలు విని పరుగెత్తుకొచ్చిన కుటుంబసభ్యులు.. పదేపదే భయపెట్టే వీడియో వైరల్.!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా రసూర్ బాద్ ప్రాంతంలోని నెహ్రూ నగర్‌లో, తన ఇంటి బయట ఆడుకుంటున్న ఒక చిన్న పాపపైకి హఠాత్తుగా కారు దూసుకొచ్చి తీవ్రంగా గాయపరిచింది.

ఆ వీధిలోకి మలుపు తిరిగిన ఒక కారు, ఊహించని విధంగా ఆ చిన్నారిపైకి ఎక్కి దిగింది. అరుపులు, కేకలు విని పరుగెత్తుకొచ్చిన పొరుగువారు, కుటుంబసభ్యులు కారు కింద చిక్కుకున్న చిన్నారిని రక్షించి, వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు.

మొదట సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించిన ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం కాన్పూర్‌లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ గురించిన సమాచారాన్ని సేకరిస్తున్న పోలీసులు, ఈ సంఘటనపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *