అయ్యో.. టమాల్‌ మని వినిపించిన శబ్దం. మచ్చా పరుగుతీయు.. క్యాసినో డైరెక్టర్‌పై జరిగిన కాల్పుల నుంచి ఎలా తప్పించుకున్నాడు?. గోవాలో కలకలం.!

గోవా రాష్ట్రం పోర్వోరిమ్‌లోని ‘మజెస్టిక్ ప్రైడ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్’ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్‌పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.

రిసార్ట్ బయట తన సెక్యూరిటీ ఆఫీసర్‌తో కలిసి కారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా రాత్రి 8:45 గంటల సమయంలో ఈ దాడి సంఘటన చోటుచేసుకుంది.

ఈ దాడి సమయంలో శ్రీనివాస్ నాయక్ అదృష్టవశాత్తూ ఎలాంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తంగా వ్యవహరించిన ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ ఎదురుకాల్పులు జరపడంతో, ఆ దాడికి పాల్పడిన వ్యక్తులు అక్కడి నుండి పరారై జాతీయ రహదారి వైపు వెళ్లారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన నార్త్ గోవా ఎస్పీ హరీష్ మక్తాయ్కర్ నేతృత్వంలోని పోలీసులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అంతేకాకుండా, నిందితులను గుర్తించడానికి మరియు వారి కదలికలను కనిపెట్టడానికి ఆ ప్రాంతంలోని, క్యాసినో పరిసరాలలోని సీసీటీవీ (కెమెరా దృశ్యాలను) పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *