జీవితంలో మర్చిపోలేని రోజుగా మిగిలిపోవాల్సిన పెళ్లి రోజున, ఒక వధువుకు ఊహించని ప్రమాదం ఎదురైన ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
వియత్నాంలోని టుయెన్ క్వాంగ్ (Tuyen Quang) ప్రాంతంలో గత నవంబర్ 10న ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల వరుడు లే వాన్ వియట్ (Le Van Viet), 19 ఏళ్ల వధువు డ్యామ్ థీ జువాన్ (Dam Thi Xuan) వివాహం కోసం కారులో వరుడి ఇంటికి వెళ్తున్నారు. మరో కొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా, వారి కారు అకస్మాత్తుగా రోడ్డు పక్కనే ఉన్న వరి పొలంలో బోల్తా పడింది.
ఈ ప్రమాదానికి గల కారణంపై వరుడు చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి కోసం కారు ముందు భాగం మొత్తం పూలతో అలంకరించారు. అయితే, ప్రయాణంలో వీచిన బలమైన గాలికి ఆ పూల అలంకరణ పైకి లేచి, కారు ముందు అద్దాన్ని (విండ్‌షీల్డ్‌ను) పూర్తిగా కప్పేసింది. దీంతో డ్రైవర్‌కు రోడ్డు సరిగా కనిపించకపోవడం వల్లే కారు సుమారు మీటరు లోతున్న బురద పొలంలో బోల్తా పడిందని చెబుతున్నారు.
కారు ప్రమాదానికి గురికావడం చూసి వెనుక వస్తున్న బంధువులు, స్థానికులు వెంటనే సహాయం చేయడానికి పరుగులు తీశారు. కారును పైకి లేపి, లోపల చిక్కుకున్న వధూవరులను సురక్షితంగా బయటకు తీశారు. అయితే, కారు వధువు వైపు బోల్తా పడటంతో ఆమెపై బురద, మట్టి పడ్డాయి. దీంతో అందంగా అలంకరించుకున్న ఆమె తెల్లటి వివాహ దుస్తులు, జుట్టు అన్నీ బురదలో కూరుకుపోయాయి. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధువు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, పెళ్లి రోజున జరిగిన ఈ విచిత్రమైన ప్రమాదం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Leave a Reply