మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. లూయిస్‌వాడి (Louiswadi) ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లా బయట నిలిపి ఉంచిన పోలీసు భద్రతా వాహనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరగడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, బంగ్లా బయట వరుసగా నిలిపి ఉంచిన పోలీసు వాహనాల్లో ఒకదాని నుంచి అకస్మాత్తుగా దట్టమైన తెల్లటి పొగ వెలువడి మంటలు చెలరేగాయి. ఇది చూసి షాక్‌కు గురైన పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి నీళ్లు పోసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పేశారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు వర్గాలు అధికారికంగా తెలిపాయి. వాహనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, దీనిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు, ముంబైలోని ఘాట్‌కోపర్ (Ghatkopar) తూర్పు ప్రాంతంలో ఉన్న 21 అంతస్తుల ‘రాయల్ ఆల్టెజా ప్యాలెస్’ నివాస భవనంలోని 20వ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీపావళి పండుగ వేడుకల్లో కాల్చిన రాకెట్ టపాసుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

Leave a Reply