“అయ్యో దేవుడా! స్వాతంత్య్ర వేడుకల్లో గంటపాటు మాట్లాడిన మంత్రి… ఉన్నట్టుండి పక్కకు ఒరిగిపోయి కళ్లు తిరిగి పడిపోవడంతో కలకలం!” ఆందోళనలో అధికారులు!

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వేదికపై నిల్చుని ఆయన సుదీర్ఘంగా ప్రసంగిస్తున్న సమయంలో, అకస్మాత్తుగా బ్యాలెన్స్ తప్పి ఒకవైపునకు ఒరిగిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కసారిగా తీవ్ర ఆందోళన, గందరగోళం నెలకొంది.

మంత్రి కిందపడిపోయే పరిస్థితిని వెంటనే గమనించిన ఆయన భద్రతా సిబ్బంది (సెక్యూరిటీ), క్షణాల్లో అప్రమత్తమై ఆయన్ను గట్టిగా పట్టుకుని కిందపడకుండా ఆపారు. గన్‌మెన్లు, అధికారుల తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పింది.

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దాదాపు గంటకు పైగా ఏకధాటిగా నిలబడి ప్రసంగించినట్లు సమాచారం. సుదీర్ఘ సమయం పాటు నిల్చోవడం వల్ల తీవ్ర అలసటకు గురై, బీపీ (రక్తపోటు) ఒక్కసారిగా పడిపోవడంతోనే ఆయన కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలిసింది.

వెంటనే వైద్యులు ఆయన వద్దకు చేరుకుని అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేదికపై మంత్రి స్పృహతప్పి పడిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.


Posted

in

by

Tags: