“అయ్యో.. నేనేం చనిపోలేదు.. ప్రాణాలతోనే ఉన్నా!” 27 నెలల తర్వాత ఇంటికొచ్చిన మహిళ: షాక్‌లో కుటుంబసభ్యులు.. లక్నోలో విస్తుపోయే ఘటన!

లక్నోలో చనిపోయిందనుకుని కుటుంబసభ్యులు అంత్యక్రియలు సైతం పూర్తి చేసిన ఓ మహిళ, ఏకంగా 27 నెలల తర్వాత సజీవంగా తిరిగి ఇంటికి వచ్చిన ఘటన తీవ్ర విస్మయానికి గురిచేసింది.

నవికోట్ నందనా గ్రామానికి చెందిన 28 ఏళ్ల శివాని అనే మహిళ, సెప్టెంబర్ 5న తన పుట్టింటికి తిరిగి రావడంతో ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యం, భయాందోళనలతో షాక్‌కు గురయ్యారు.

సుమారు ఏడాదిన్నర క్రితం ఐఐఎం రోడ్డు వెనుక ఉన్న డ్రైనేజీ కాలువలో గుర్తుతెలియని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. అది శివాని మృతదేహమేనని ఆమె కుటుంబసభ్యులు గుర్తించడంతో, భైంసాకుండ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అంతేకాకుండా, అదనపు కట్నం కోసం వేధించి శివానిని చంపేశారంటూ ఆమె అత్తింటివారిపై అప్పట్లో పోలీసు కేసు కూడా పెట్టారు.

అయితే ఇప్పుడు శివాని ప్రాణాలతో తిరిగి రావడంతో ఈ వ్యవహారం పెద్ద మలుపు తిరిగింది. మరి నాడు డ్రైనేజీలో దొరికిన మృతదేహం ఎవరిది? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై సమగ్ర వివరాలు రాబట్టేందుకు పోలీసులు శివానిని పోలీస్ స్టేషన్‌కు తరలించి లోతుగా విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: