గుజరాత్ రాష్ట్రం అమ్రేలి జిల్లా రాజుల సమీపంలో అకస్మాత్తుగా ఓ పంది రోడ్డుకు అడ్డంగా రావడంతో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 36 ఏళ్ల బైక్ రైడర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
అతను తన దుకాణానికి బైక్పై వెళ్తున్న సమయంలో ఊహించని విధంగా పంది అడ్డంగా దూసుకురావడంతో, వాహనాన్ని అదుపు చేయలేక కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయి అక్కడికక్కడే విగతజీవిగా పడి ఉన్నాడు.
ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన పూర్తి దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో విడుదలై, చూసేవారి గుండెల్లో వణుకు పుట్టిస్తూ ఇంటర్నెట్లో వైరల్గా మారుతోంది.

Leave a Reply