అమరా అనే అందమైన చిన్నారి, తన తండ్రి ద్వారా తొలిసారిగా నాన్ రొట్టె, బటర్ చికెన్ వంటి భారతీయ వంటకాలను రుచిచూసి ఆనందిస్తున్న వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ఇప్పటికే లెబనీస్, ఇటాలియన్, ఐరిష్ వంటకాలను రుచిచూసిన ఆ చిన్నారి, ఇప్పుడు తన తండ్రి ద్వారా భారతీయ వంటకాలను ఎంతో ఆసక్తిగా రుచిచూసింది.
తండ్రి మొదట తినిపించిన నాన్ రొట్టెను రుచిచూడగానే, ఆ చిన్నారి తలూపుతూ తన సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా, బటర్ చికెన్‌ను కూడా ఎంతో ఇష్టంగా తిన్నది.
చిన్నారికి కారం ఎక్కువ కాకూడదనే ఉద్దేశ్యంతో తండ్రి జాగ్రత్తపడి తగిన మోతాదు కంటే తక్కువే తినిపించాడు. అలాగే, ఆ పాప ఇస్తున్న క్యూట్ రియాక్షన్స్‌ను చూసి మురిసిపోయాడు.
భారతీయ వంటకాలు ఆ చిన్నారికి ఎంతగానో నచ్చాయి. ఇంటర్నెట్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్న ఈ అందమైన వీడియో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

Leave a Reply