“అరెరే! ముఖంపై అనవసరమైన రోమాలా..?” దిగులు విడిచిపెట్టండబ్బా.. ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే తొలగించుకోవడానికి 4 సులువైన సహజ మార్గాలు..!!!

చాలామంది మహిళలకు బుగ్గలు, పైపెదవి మరియు గడ్డం భాగాలలో పురుషుల లాగా రోమాలు పెరగడం సాధారణ విషయమే.

ఇది శరీరంలో కలిగే హార్మోన్ల మార్పుల వల్ల సంభవించినప్పటికీ, చాలామంది మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేదిగా మారుతోంది. దీని కోసం మార్కెట్లో లభించే క్రీములు, కెమికల్ చికిత్సలను ఉపయోగించినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించదు. కానీ, మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ రోమాలను సురక్షితంగా తొలగించుకోవచ్చు.

చర్మంలోని మృతకణాలు, అనవసరమైన రోమాలను తొలగించడంలో తేనె మరియు చక్కెర మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఒక స్పూన్ తేనెకు, రెండు స్పూన్ల చక్కెర మరియు కొద్దిగా నీరు కలిపి చక్కెర కరిగే వరకు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రోమాలు ఉన్న చోట రాసి, కొంత సమయం తర్వాత వలిచి తీస్తే రోమాల పెరుగుదల క్రమంగా తగ్గుతుంది. అదేవిధంగా, రెండు స్పూన్ల శనగపిండికి రెండు స్పూన్ల గులాబీ నీరు (రోజ్ వాటర్) కలిపి పేస్ట్‌లా రాస్తూ వచ్చినా రోమాల పెరుగుదల అదుపులోకి వస్తుంది.

కోడిగుడ్డు మరియు జొన్నపిండి (కార్న్ ఫ్లోర్) మిశ్రమం కూడా ముఖంపై ఉండే రోమాలను తొలగించడానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోడిగుడ్డు తెల్లసొనకు కొద్దిగా జొన్నపిండి, చక్కెర కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ‘మాస్క్’ లా వేసుకోవాలి. ఇది బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే రోమాలు సులభంగా తొలగిపోతాయి.

అలాగే బొప్పాయి పండు తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి, దానికి ఒక స్పూన్ పసుపు పొడి చేర్చి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. దీన్ని నిరంతరం చేస్తూ ఉంటే ముఖంలోని అనవసర రోమాలు పూర్తిగా తొలగిపోవడంతో పాటు చర్మం సహజంగానే మెరుస్తూ మారుతుంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *