“అరె.. ఇలాంటి తెలివితేటలు కూడా ఉంటాయా..?” రూ.1000 ఆదా.. చెప్పుతో తలుపుకు వేసిన మాస్టర్ ప్లాన్.. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో..!!

ఇంటర్నెట్‌లో రోజూ రకరకాల వింత వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా, వాటిని చేసిన వారి తెలివితేటలను చూసి ముక్కున వేలేసుకునేలా చేస్తాయి. ఆ కోవలోనే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

ఇళ్లలో తలుపులు వాటంతట అవే మూసుకోవడానికి ‘ఆటో డోర్ క్లోజర్’ (Auto Door Closer) అమర్చుతుంటారు. దీనికోసం కనీసం రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుంది. కానీ, ఆ ఖర్చేమీ లేకుండా ఓ వ్యక్తి పాత చెప్పును ఉపయోగించి అద్భుతమైన టెక్నిక్‌ను కనిపెట్టాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, ఓ వ్యక్తి పాత చెప్పును తీసుకుని తలుపుకు, దాని చెక్క ఫ్రేమ్‌కు మధ్యలో పెట్టి స్క్రూలతో బిగించాడు. ఆ తర్వాత తలుపును తెరిచి వదిలేస్తే, అది దానంతట అదే నెమ్మదిగా మూసుకుంటోంది.

ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి ఆటో డోర్ క్లోజర్ పెడితే ఎలా పనిచేస్తుందో, ఈ చెప్పుతో చేసిన సెటప్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా పనిచేస్తోంది. కేవలం 100 రూపాయల చెప్పుతో వేల రూపాయల డబ్బు ఆదా చేసిన ఈ ఐడియా చాలా మందిని ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/DXopLPMhIKu/?utm_source=ig_embed&utm_campaign=invalid&ig_rid=ASpmcynKgjK-BvwhFUfANP-

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. “ఇది డోర్ క్లోజర్ కాదు, చెప్పు క్లోజర్” అని ఒకరు ఫన్నీగా కామెంట్ చేయగా, “100 రూపాయల చెప్పును పాడు చేయడం అనవసరమైన పని” అని మరొకరు అభిప్రాయపడ్డారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *