“అరేయ్ ఎవడ్రా నువ్వు! గాల్లో ఎగురుతున్న విమానం తలుపు తీయడానికి యత్నించిన వ్యక్తి..!” తోటి ప్రయాణికులు చేసిన పని.. వైరల్ వీడియో..!!

కౌలాలంపూర్ నుండి కేరళలోని కొచ్చికి వెళ్తున్న బాటిక్ ఎయిర్ విమానంలో, నడిగాల్లో ఎగురుతున్న సమయంలో ప్రయాణికుడు ఒకరు హఠాత్తుగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ తలుపును తెరవడానికి ప్రయత్నించిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది.

ఆగస్టు 5 అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అర్ధరాత్రి సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు, గాలి వేగంగా వీచే భయానక శబ్దం విని ఉలిక్కిపడి లేచారు. ఎమర్జెన్సీ తలుపు వద్ద కూర్చున్న వ్యక్తి, కిటికీ పలకను పగులగొట్టి తలుపు తెరవడానికి ప్రయత్నించినట్లు తేలింది. అయినప్పటికీ, విమానం యొక్క ఆధునిక రూపకల్పన మరియు క్యాబిన్ ప్రెజర్ కారణంగా అదృష్టవశాత్తూ తలుపు తెరచుకోలేదు.

వెంటనే స్పందించిన తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని తాడుతో బంధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విమానం కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ఆ వ్యక్తిని కట్టడి చేసిన స్థితిలోనే ఉంచారు. ఆ తర్వాత ఆయనను విమానాశ్రయ అధికారులకు అప్పగించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భయాందోళనకరమైన అనుభవాన్ని పంచుకున్న ఒక ప్రయాణికుడు, “ఇది చాలా భయానకమైన అనుభవం, మంచి వేళకి సిబ్బంది తక్షణ చర్యల వల్ల మేమందరం సురక్షితంగా బయటపడ్డాము” అని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్‌లో ఈ వీడియోను చూసిన పలువురు సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని, ప్రయాణికులను ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో, ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఆ వ్యక్తిపై విమానాల్లో ప్రయాణించకుండా శాశ్వత నిషేధం విధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Posted

in

by

Tags: