అర్జెంటీనా గెలుస్తుందని ప్లాన్ చేసి.. ముందే పోస్ట్ పెట్టిన అధ్యక్షుడు? అంతర్జాతీయ కుట్ర బయటపడిందా?

లండన్: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో స్పేన్ జట్టు చేతిలో అర్జెంటీనా ఓడిపోయిన నేపథ్యంలో, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ (Javier Milei) చేసిన ఒక పోస్ట్ పెద్ద వివాదానికి దారితీసింది.

అమెరికాలోని న్యూజెర్సీ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో, స్పేన్ జట్టు 1-0 గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించి ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాచ్ అదనపు సమయంలో (ఎక్స్‌ట్రా టైమ్) స్పేన్ ఆటగాడు ఫెర్రాన్ టోరెస్ (Ferran Torres) చేసిన గోల్ ఆ జట్టు విజయానికి కారణమైంది.

అధ్యక్షుడి పోస్ట్ మ్యాచ్ ముగిసిన కొన్ని నిమిషాలకే అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మైలీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అందులో, “ప్రపంచవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్జెంటీనా జట్టు సాధించిన ఘనతను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి, ఆటగాళ్లు మరియు జట్టు యాజమాన్యం కోరుకునే ఒక రోజును ఎంచుకుని, ఆ రోజును జాతీయ ప్రభుత్వ సెలవు దినంగా (నేషనల్ హాలిడే) ప్రకటించబోతున్నాం” అని పేర్కొన్నారు.

ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోయినప్పటికీ, అధ్యక్షుడు మైలీ వేడుకల కోసం సెలవు ప్రకటించడం ఆ దేశ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది.

నెటిజన్ల ఘాటు ట్రోల్స్ అధ్యక్షుడి పోస్ట్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో అభిమానులు ఆయనను దారుణంగా అపహాస్యం చేయడం ప్రారంభించారు. అర్జెంటీనా జట్టు ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసి, ఆయన ఈ పోస్ట్‌ను ముందే ‘షెడ్యూల్’ (Schedule) చేసి పెట్టారని, జట్టు ఓడిపోయిన తర్వాత దాన్ని డిలీట్ చేయడం మర్చిపోయారని చాలా మంది ఆరోపించారు.

మరికొందరైతే.. ఎలాగైనా అర్జెంటీనాను గెలిపించేలా చేయాలని ఆయన భావించి ఉండవచ్చని.. అంటే అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా కుట్ర చేసి విజయం సాధించవచ్చని అనుకుని ఉంటారని.. అందుకే ఈ పోస్ట్‌ను ముందే షెడ్యూల్ చేసి ఉంచారని, కానీ ఆ తర్వాత డిలీట్ చేయడం మర్చిపోయారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

సాధారణంగా ఏ టోర్నమెంట్‌లోనైనా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇలాంటి జాతీయ స్థాయి వేడుకలు లేదా అధికారిక సెలవులు ప్రకటించడం ఆనవాయితీ కాదు. ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లు తమ క్లబ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు తిరిగి వెళ్లడాన్ని పక్కనబెట్టి, ఇలా వేడుకల్లో మునిగిపోవడం సరైంది కాదని అర్జెంటీనా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.

అయినప్పటికీ, ఈ వేడుకలు మరియు సెలవుల ప్రకటన వెనుక మరో ముఖ్యమైన కారణం కూడా వినిపిస్తోంది. అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సి (Lionel Messi) జాతీయ జట్టు తరఫున ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావచ్చునని భావిస్తున్నారు. 2022 ప్రపంచ కప్‌లో జట్టును చారిత్రాత్మక విజయపథంలో నడిపించిన మెస్సికి ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిన్నటి మ్యాచ్‌లో మెస్సి ఆటతీరు కాస్త మందకొడిగానే సాగింది. ఓటమి తర్వాత మెస్సి మైదానంలో కన్నీరు పెట్టుకోవడం అభిమానులను తీవ్ర శోకంలో ముంచెత్తింది. ఆ బాధను దూరం చేయడానికే ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నారు.


Posted

in

by

Tags: