దుఃఖం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఒక్కోసారి అది ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేస్తుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక లగ్జరీ BMW కారును తాళ్లతో లోతైన గుంటలోకి దించుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. తన కుమారుడి మరణం తర్వాత, ఆ తండ్రి తన రూ. 6 కోట్ల విలువైన కారును ఇలా సమాధి చేసినట్లు సమాచారం.
వీడియోలో ఏముంది? ఆ వీడియోలో నలుపు రంగులో ఉన్న ఒక BMW కారును పసుపు రంగు బెల్టుల సహాయంతో నెమ్మదిగా గుంటలోకి దించుతున్నారు. ఆ కారు పట్టేంత లోతుగా ఆ గుంటను తవ్వారు. “తన కుమారుడి మరణం తర్వాత ఒక తండ్రి రూ. 6 కోట్ల కారును పాతిపెడుతున్నాడు” అనే టెక్స్ట్ ఆ వీడియోపై కనిపిస్తుంది. దీనికి జోడించిన క్యాప్షన్.. “ప్రజలు డబ్బును, హెడ్‌లైన్స్‌ను చూస్తున్నారు కానీ, ఒక తండ్రి పగిలిన గుండెను చూడలేకపోతున్నారు” అని పేర్కొంది.
నెటిజన్ల స్పందన: ఈ వీడియో ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఆ తండ్రి నిర్ణయాన్ని సమర్థిస్తూ, “ప్రేమించే వ్యక్తి లేనప్పుడు వస్తువులకు విలువేముంది?” అని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం విమర్శిస్తూ, “ఆ కారును అమ్మేసి, వచ్చిన డబ్బును పేదలకు దానం చేసి ఉంటే బాగుండేది” అని అభిప్రాయపడ్డారు.
