ఆకస్మిక వరద.! ఉధృతంగా ప్రవహించిన వాగులో కొట్టుకుపోయిన ఆరుగురు. గల్లంతైన యువతి.. వైరల్ అవుతున్న భయానక వీడియో.!!

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా నిలంబూర్ ప్రాంతంలోని కొట్టప్పుళా నదిలో, ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మికంగా వరద ఉధృతంగా ప్రవహించింది.

ఆ సమయంలో నదిలోకి దిగిన ఆరుగురు వ్యక్తులు ఊహించని విధంగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు.

సోమవారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), అగ్నిమాపక శాఖ మరియు స్థానిక ప్రజలు కలిసి జరిపిన ముమ్మర గాలింపు చర్యలలో మరో మూడు మృతదేహాలు లభించాయి. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5కి చేరింది.

నదిలో కొట్టుకుపోయిన వారిలో సజిత (26) అనే యువతి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో, ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొండప్రాంత అటవీ ప్రాంతంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే కురిసిన కుండపోత వర్షమే ఈ ఆకస్మిక వరదలకు కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *