ఆకాశం నుంచి భూమి వైపు దూసుకొస్తున్న 1,500 కిలోల నాసా టెలిస్కోప్.! ఇండియా కూడా డేంజర్ జోన్‌లో ఉందా.? ఎక్కడ పడుతుంది.? శాస్త్రవేత్తలు వెల్లడించిన షాకింగ్ సమాచారం.!!

అంతరిక్షంలో కొన్నేళ్లుగా సేవలందిస్తున్న నాసా (NASA)కు చెందిన ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్’ (Neil Gehrels Swift) టెలిస్కోప్ ప్రస్తుతం భూమి వైపు దూసుకొస్తోంది.

సుమారు 1.5 టన్నుల (1,500 కిలోల) బరువున్న ఈ అంతరిక్ష పరిశోధనా పరికరాన్ని 2004 నవంబర్ 20న అంతరిక్షంలోకి ప్రయోగించారు. సుమారు 22 ఏళ్లుగా విశ్వంలో సంభవించే గామా-రే విస్ఫోటనాలు, సూపర్ నోవా వంటి అంతరిక్ష పరిణామాలను ఇది అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం దీని కక్ష్య ఎత్తు క్రమంగా తగ్గుతుండటంతో, భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే పరిస్థితి ఏర్పడింది.

గత కొన్నేళ్లుగా తీవ్రమైన సూర్యుడి కార్యకలాపాల (Solar activities) కారణంగా భూమి పై పొర వాతావరణం విస్తరించింది. దీనివల్ల టెలిస్కోప్‌పై వాతావరణ రాపిడి (Atmospheric Drag) పెరిగి, దాని కక్ష్య ఎత్తు వేగంగా తగ్గిపోయింది. దీన్ని నివారించి టెలిస్కోప్‌ను తిరిగి ఎత్తైన కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు నాసా ప్రయత్నించింది. దీనికోసం పంపిన ‘లింక్’ (Link) అనే రోబోటిక్ వ్యోమనౌక స్విఫ్ట్ టెలిస్కోప్‌ను సమీపించి పట్టుకోలేకపోయింది. దీంతో ఆ రెస్క్యూ ఆపరేషన్‌ను నాసా విరమించుకుంది.

ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా దానిలోని చాలా భాగాలు కాలి బూడిదవుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ, సీసం కంటే అధిక సాంద్రత కలిగిన టంగ్‌స్టన్ లోహంతో తయారు చేసిన కొన్ని భాగాలు, అద్దపు ముక్కలు వాతావరణాన్ని దాటి భూమిని చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి ఎక్కడ పడతాయనేది కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. మిగిలిన భాగాలు సముద్రంలో పడిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

అమెరికా అంతరిక్ష దళం (US Space Force) అంచనా ప్రకారం, టెలిస్కోప్ నవంబర్ మొదటి వారంలో భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అది పడిపోయే అవకాశం ఉన్న మార్గంలో ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా, ఆగ్నేయాసియా, అమెరికా ఖండాలలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఇండియాలో కూడా కొన్ని భాగాలు పడే అవకాశం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఇండియాలో కచ్చితంగా ఏ ప్రాంతంలో పడుతుందనేది ఇప్పటివరకు అంచనా వేయలేదు; సముద్రంలో పడిపోయే అవకాశమే ఎక్కువగా ఉన్నందున ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *