మన దేశంలో ఎంతోమంది సామాన్యులు తమ కష్టాన్ని, పట్టుదలను నమ్ముకుని జీవితంలో ముందుకు సాగుతుంటారు. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, తమలోని ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి ఓ అద్భుతమైన వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో సాధారణ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యంతో ప్రయాణికులను ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులతో ఎలాంటి తడబాటు లేకుండా అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ప్రస్తుత కాలంలో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎంత ముఖ్యమో వారికి వివరిస్తున్నాడు.
సాధారణంగా ఆటోలో ప్రయాణం మొదలైతే డ్రైవర్‌తో ఛార్జీ, గమ్యస్థానం గురించి మాత్రమే మాట్లాడుతుంటాం. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం తన ప్రయాణికులతో ఇంగ్లీష్‌లో సంభాషణ మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
మొదట ఆయన ఇంగ్లీష్ మాట్లాడటం చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఆయన ఉచ్చారణ, పదజాలం, మాట్లాడే విధానం చూసి నోరెళ్లబెడుతున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా ఆంగ్లంలో మాట్లాడుతున్న ఆయన ప్రతిభకు ఫిదా అవుతున్నారు.
ఇంతటితో ఆగకుండా.. నేటి పోటీ ప్రపంచంలో మనం సొంత ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందుకోవాలంటే ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడం ఎంతో అవసరమని ప్రయాణికులకు వివరిస్తున్నాడు.
ఒక ఉపాధ్యాయుడిలా ఇంగ్లీష్ ప్రాధాన్యతను, దాని వల్ల కలిగే ప్రయోజనాలను తనదైన శైలిలో చెబుతున్నాడు. పెద్ద పెద్ద చదువులు చదివినవారు కూడా చెప్పలేని విషయాలను ఒక సాధారణ ఆటో డ్రైవర్ ఎంతో సులభంగా వివరిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్య అనేది కేవలం పాఠశాలలు, కళాశాలలకే పరిమితం కాకూడదని, అది మనిషి జీవితాన్ని మార్చే శక్తిగా మారాలని ఈ ఆటో డ్రైవర్ నిరూపిస్తున్నాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, పెద్దగా చదువుకునే అవకాశం లేకపోయినా.. స్వయంకృషి, పట్టుదల, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే ఎంతటి నైపుణ్యమైనా సాధించవచ్చని ఈ వ్యక్తి నిరూపిస్తున్నాడు.
సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తూ, తన ప్రయాణికులకు ఇంగ్లీష్ పాఠాలు చెబుతూ, జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రేరణనిస్తున్న ఈ వ్యక్తి ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Leave a Reply