‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జరిగిన ఆ రహస్య కదలిక! చైనా అసలు రూపాన్ని బయటపెట్టిన అమెరికా నివేదిక.. పాకిస్థాన్‌తో కలిసి తెరవెనుక కుట్ర!

భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌కు చైనా తెరవెనుక సహాయం చేస్తోందని అమెరికాకు చెందిన ఓ కీలక నివేదికలో సంచలన విషయం వెలుగుచూసింది.

పాకిస్థాన్‌తో చైనా పెంచుకుంటున్న సైనిక కూటమి భారత్‌కు ‘ద్విముఖ యుద్ధం’ పరిస్థితిని సృష్టిస్తోందని, ఇది భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ఆ నివేదిక పేర్కొంది.

గత మే 2025లో పాకిస్థాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టినప్పుడు, చైనా నేరుగా యుద్ధంలోకి దిగనప్పటికీ క్లిష్ట సమయంలో పాకిస్థాన్‌కు అండగా నిలుస్తుందనే విషయం స్పష్టమైంది. దీనివల్ల భవిష్యత్తులో పాకిస్థాన్‌తో ఘర్షణ తలెత్తితే చైనా కచ్చితంగా ఆ దేశానికి మద్దతుగా నిలుస్తుందనే భారత్ ఆందోళన మరింత పెరిగింది.

భారీ జనాభా, బలమైన ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి కలిగిన భారత్ తనకు సవాలుగా ఎదగడాన్ని చైనా ఏమాత్రం ఇష్టపడటం లేదని అమెరికా నివేదిక తెలిపింది. అందుకే భారత్ ఎదుగుదలను అడ్డుకోవడానికి సైనిక, ఆర్థిక, సముద్ర మార్గాల్లో చైనా నిరంతరం ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా 2020 గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పెద్ద మలుపు తిరిగింది.

2024 చివరి నుంచి భారత్, చైనా తమ సంబంధాలను క్రమంగా పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య అపనమ్మకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా సాధారణ స్థితికి రావాలంటే సరిహద్దులో శాంతి నెలకొనడం అత్యవసరమని భారత్ స్పష్టం చేసింది. ఇందుకోసం పలు దఫాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *