ఆపరేషన్ సిందూర్: 4 రోజుల్లో అమెరికాకు 40 సార్లు కాల్ చేసిన మునీర్; అప్పుడే ఆగిన ఆపరేషన్.. పాక్ అసలు రంగు బయటపడిందిలా!

ఆపరేషన్ సిందూర్: గత ఏడాది మే నెలలో పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. గతంలో పాకిస్థాన్ వాదిస్తూ.. భారతే అమెరికాకు ఫోన్ చేసి కాల్పుల విరమణ (Ceasefire) చేయించాలని కోరిందని చెప్పుకొచ్చింది.

కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన Foreign Agents Registration Act (FARA) కింద దాఖలైన కొత్త లాబీయింగ్ పత్రాలు ఒక పెద్ద నిజాన్ని వెల్లడించాయి. మే 6 నుండి మే 9, 2025 మధ్య పాకిస్థాన్ వాషింగ్టన్‌లోని రాజకీయ, రక్షణ మరియు జాతీయ భద్రతా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఈ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. విశేషమేమిటంటే, సరిగ్గా అదే సమయంలో భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది.

4 రోజుల్లో 60 సార్లు అమెరికా అధికారులతో సంప్రదింపులు
బయటకు వచ్చిన పత్రాల ప్రకారం.. ఆ నాలుగు రోజుల్లో పాకిస్థాన్ అమెరికా ఎంపీలు, కాంగ్రెస్ సిబ్బంది, ట్రెజరీ విభాగం, జాతీయ భద్రతా సలహాదారులు, రక్షణ అధికారులు మరియు జర్నలిస్టులతో సుమారు 60 సార్లు వేర్వేరుగా చర్చలు జరిపింది. భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ అమెరికాలో ఎంతటి తీవ్రమైన దౌత్య ప్రచారాన్ని (Diplomatic Campaign) నిర్వహించిందో దీని ద్వారా అర్థమవుతోంది.

అసిమ్ మునీర్ చేసిన వాదన ఏమిటి?
పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ స్వయంగా అమెరికాను మధ్యవర్తిత్వం వహించాలని కోరిందని క్లెయిమ్ చేశారు. రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)లో ‘మర్కా-ఎ-హక్’ (భారత్‌తో జరిగిన ఆ 4 రోజుల ఘర్షణను పాక్ ఇలా పిలుచుకుంటుంది) ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

తనను తాను పొగుడుకున్న మునీర్
ఆ యుద్ధ సమయంలో పాకిస్థాన్ వ్యూహం భారత్ కంటే మెరుగ్గా ఉందని మునీర్ చెప్పుకొచ్చారు. “భారత్ అమెరికా నాయకత్వం ద్వారా మధ్యవర్తిత్వానికి ఇష్టపడింది, ప్రాంతీయ శాంతి దృష్ట్యా మేము దానిని అంగీకరించాం” అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఎటువంటి మూడవ పక్షం (Third Party) మధ్యవర్తిత్వాన్ని భారత్ కోరలేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

పహల్గాం దాడి తర్వాత మొదలైన ఆపరేషన్ సిందూర్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ మరియు ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ (PoJK)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు ప్రారంభించిన వెంటనే, పాకిస్థాన్ వాషింగ్టన్‌లో తన రాజకీయ ఒత్తిడిని పెంచింది. మే 6, 7 (2025) రాత్రి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తూ.. భారత సాయుధ దళాలు పాకిస్థాన్ మరియు PoJKలోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన (Precise) దాడులు చేశాయని తెలిపింది. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నదని, పాక్ సైనిక స్థావరాలను కాదని భారత్ స్పష్టం చేసింది.

అమెరికా ముందు పాక్ ‘భిక్షాటన’
పాకిస్థాన్ రాయబారికి అమెరికా అధికారులతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని పాక్ ప్రాధేయపడినట్లు FARA పత్రాలు చెబుతున్నాయి. మే 9 నాటికి పాక్ కార్యకలాపాలు మరింత ముదిరాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ తనదైన శైలిలో యుద్ధం చేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం అమెరికాను కాపాడమని వేడుకుంటోంది.

CNN నివేదికతో సరిపోలుతున్న వివరాలు
ఈ తాజా వెల్లడి గతంలో CNN ఇచ్చిన నివేదికతో ఏకీభవిస్తోంది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు జరిగాయని, అయితే ఇరు దేశాల DGMO (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్) మధ్య జరిగిన హాట్‌లైన్ చర్చల తర్వాతే యుద్ధం ఆగిందని ఆ నివేదిక పేర్కొంది.


Posted

in

by

Tags: