“ఆరు రోజుల కాపురానికే నెలవారీ భరణమా?”: భార్య పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు సంచలన తీర్పు..!!!

పెళ్లయిన కేవలం ఆరంటే ఆరు రోజులకే భర్తను వదిలి వెళ్లిపోయి, ఆ తర్వాత అతనిపై నెలవారీ భరణం (జీవనభృతి) కోరుతూ కోర్టుకెక్కిన భార్యకు హైకోర్టు గట్టి మొట్టికాయ వేసింది.

వైవాహిక బంధంలో అతి తక్కువ రోజులు మాత్రమే కలిసి ఉండి, ఎలాంటి సహేతుక కారణం లేకుండా భర్తను విడిచిపెట్టిన భార్యకు భరణం పొందే అర్హత గానీ, హక్కు గానీ లేదని స్పష్టం చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఈ కేసును విచారించిన హైకోర్టు, ఒక మహిళ తన భర్త నుంచి నెలవారీ భరణం పొందాలంటే, ఆమె ఆ వైవాహిక బంధానికి కట్టుబడి నిజాయితీగా, న్యాయబద్ధంగా జీవించి ఉండాలని పేర్కొంది. కేవలం ఆరు రోజులు మాత్రమే భర్తతో కలిసి ఉండి, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించకుండా ఏకపక్షంగా వెళ్లిపోయిన పరిస్థితుల్లో, భర్త నుంచి భరణం డిమాండ్ చేయడం చట్టప్రకారం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో కుండబద్దలు కొట్టారు.

భర్తకు ఊరటనిచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పు, నిరాధారమైన కేసులు, అన్యాయమైన భరణం డిమాండ్లతో సతమతమవుతున్న ఎందరో పురుషులకు కొత్త భరోసానిచ్చింది. వివాహ చట్టాలను, భరణం నిబంధనలను దుర్వినియోగం చేస్తూ డబ్బు వసూలు చేయాలనుకునే వారికి ఈ హైకోర్టు తీర్పు ఒక గుణపాఠంలా నిలుస్తుందని న్యాయ నిపుణులు, సామాజిక విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.


Posted

in

by

Tags: