భారత్లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 52 లక్షల వివాహాలు జరగనున్నట్లు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (CAIT) వెల్లడించింది. ఈ శుభముహూర్తాల రోజుల్లో సగటున రోజుకు 2 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరగనున్నాయి.
ఈ భారీ పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ప్రయాణ ఖర్చులు, బంగారు ఆభరణాల కొనుగోళ్లు, విందు భోజనాల ఏర్పాట్లు తదితరాల కోసం భారతీయులు సుమారు రూ.7.5 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇంత భారీ స్థాయిలో కొనుగోళ్లు జరగనుండటంతో దేశ వాణిజ్య మార్కెట్లో పెద్ద ఎత్తున నగదు చలామణి అవుతుందని అంచనా వేస్తున్నారు.
రాబోయే కొన్ని వారాల పాటు దేశవ్యాప్తంగా సందడి చేయనున్న ఈ పెళ్లిళ్ల వేడుకలు… నగల వ్యాపారులు, వస్త్ర విక్రేతలు, క్యాటరింగ్ సంస్థలు, రవాణా రంగం వారికి భారీ వ్యాపార అవకాశాలను కల్పించనున్నాయి. అఖిల భారత వ్యాపారుల సమాఖ్య వెల్లడించిన ఈ వివరాలు వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Leave a Reply