ఆ అమ్మాయిని చూడగానే చేతికి గాజులు తొడిగి పెళ్లాంగా మార్చేసుకున్నాడు భయ్యా..! తాళి కట్టకుండానే పెళ్లి.. ఆఫ్రికా వెళ్లిన పాకిస్థానీ యువతికి వింత అనుభవం.. వైరల్ వీడియో!

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ పాకిస్థానీ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.

రబియా అనే ఆ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు, అక్కడి ‘హమర్’ (Hamar) అనే తెగకు చెందిన గిరిజనులను కలిశారు. ఆ సమయంలో అక్కడ జరిగిన ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. రబియా గిరిజనుల మధ్య నిలబడి ఉండగా, అక్కడ ఉన్న ఒక యువకుడు ఊహించని విధంగా ఆమె చేతులకు గాజులు తొడిగాడు. ఆ తెగ ప్రజల సంప్రదాయం ప్రకారం, ఒక యువతికి గాజులు వేయడం అంటే పెళ్లి చేసుకోవడంతో సమానం. దీంతో ఆ యువకుడు రబియాను తన భార్యగా భావించి, ఆమెను తన అర్ధాంగిగా పిలవడం మొదలుపెట్టాడు.

అయితే, అక్కడ ఎలాంటి మతపరమైన ఆచారాలు గానీ, ఒప్పందాలు గానీ జరగకపోవడం గమనార్హం. ఈ విచిత్రమైన ఘటనను చూసిన నెటిజన్లు సరదా కామెంట్లతో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. కొందరు దీన్ని ఒక ఫన్నీ కల్చరల్ ఎక్స్‌పీరియన్స్‌గా భావిస్తుండగా, మరికొందరు ప్రపంచంలో ఒక్కో సంస్కృతిలో వివాహ ఆచారాలు ఎంత భిన్నంగా ఉంటాయో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆసక్తికర అనుభవాన్ని రబియా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా పంచుకున్నారు. ఎలాంటి కంగారు పడకుండా పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమె కూడా నవ్వుతూ ఆ వింత క్షణాలను ఎంజాయ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులను పరిచయం చేసే రబియా ఆఫ్రికా టూర్ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *