“ఆ టార్చర్ భరించలేకపోతున్నాను.. ఇల్లు ఊడవడం, తుడవడం, గిన్నెలు కడగడం అంతా నేనే చేస్తున్నా! అయినా వేధిస్తున్న భార్య..” – ఇన్‌స్టాలో సూసైడ్ నోట్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త!!

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌కు చెందిన 28 ఏళ్ల వ్యాపారవేత్త, తన భార్య మరియు ఆమె కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టిన కొద్ది గంటలకే ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఆవేదన: తను ఆత్మహత్య చేసుకునే ముందు పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో, ఇల్లు ఊడవడం, తుడవడం, పాత్రలు కడగడం వంటి ఇంటి పనులన్నీ తనే చేస్తున్నానని, అయినా తన భార్య తనను నిరంతరం కొడుతూ మానసికంగా వేధిస్తోందని అతను కన్నీళ్లతో చెప్పుకున్నాడు. పెళ్లై ఏడాది మాత్రమే కావస్తున్నా, తన భార్య కుటుంబ సభ్యులు తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని, ఆ ఒత్తిడిని భరించలేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు: ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం ప్రకారం, ఆ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతని భార్య మరియు మామగారి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలోని ఆధారాలను పరిశీలిస్తూ, పోలీసులు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు.


Posted

in

by

Tags: