“ఆ 7 ఏళ్ల పసిబిడ్డను కూడా చంపడానికి మనసెలా వచ్చిందిరా..?” ఒకే కుటుంబంలోని 7 గురిని బలితీసుకున్న క్యాబ్ డ్రైవర్.. అడవుల్లో మృతదేహాలను పడేసిన సైకో కిల్లర్.. గుండెలను పిండేస్తున్న దారుణం..!!

కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో, చాముండి కొండల అటవీ ప్రాంతం నుంచి మరో రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలాన్ని, దిగ్భ్రాంతిని రేపుతోంది.

తాజాగా వెలికితీసిన మృతదేహాలు శివకుమార్, దివ్యలవిగా గుర్తించారు. దీంతో ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు మొత్తం 5 గురి మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

కుటుంబ కలహాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టిన ఇందూకేశర్ అనే అద్దె కారు (క్యాబ్) డ్రైవర్, తన భార్య, అత్త మృతదేహాలను తమిళనాడులోని ఏర్కాడ్ అటవీ ప్రాంతంలోనూ, 7 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని నంది హిల్స్ ప్రాంతంలోనూ పడేసినట్లు ఇప్పటికే వెల్లడైంది.

గత 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు, రాజాజీనగర్‌లోని తన ఇంటి నుంచి మృతదేహాలను కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లోకి తీసుకెళ్లి పారేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హత్యలు చేయడానికి ముందు బాధితులకు మత్తుమందు ఇచ్చి, వారు అరిచే అరుపులు చుట్టుపక్కల వారికి వినిపించకుండా ఉండేందుకు టీవీ సౌండ్ పెంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాగా, మిగిలిన రెండు మృతదేహాలను కనుగొనేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *