కెరీర్ డెస్క్: ఇంటర్మీడియట్ (+2) పరీక్షలు ముగిశాయి.. ఇప్పుడు ప్రతి విద్యార్థి మదిలో మెదిలే ఏకైక ప్రశ్న ‘నెక్స్ట్ ఏంటి?’. కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ మాత్రమే కాకుండా, నేటి ఆధునిక కాలంలో తక్కువ సమయంలోనే నేర్చుకుని, వేలకు వేలు.. అనుభవం వస్తే లక్షల్లో సంపాదించే అద్భుతమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. త్వరగా కెరీర్లో సెటిల్ అవ్వాలనుకునే వారి కోసం బెస్ట్ కెరీర్ ఆప్షన్లు ఇవే!
- డిజిటల్ మార్కెటింగ్: ఆన్లైన్ ప్రపంచానికి మీరే రాజు!
నేటి సోషల్ మీడియా యుగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగం ఇది. SEO, సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటివి నేర్చుకుంటే 3-6 నెలల్లోనే ఉద్యోగం సాధించవచ్చు.
ఫీజు: ₹30,000 నుండి ₹1 లక్ష వరకు.
జీతం: ప్రారంభంలో నెలకు ₹15,000 – ₹30,000. అనుభవం ఉంటే ₹60,000 దాటుతుంది.
- వెబ్ డెవలప్మెంట్: కోడింగ్‌తో వెబ్సైట్ సృష్టించండి!
వెబ్సైట్లను రూపొందించే నైపుణ్యం ఉంటే మీకు తిరుగుండదు. 6-12 నెలల్లో ఫుల్-స్టాక్ డెవలపర్ కావచ్చు.
జీతం: ప్రారంభంలో ₹20,000 – ₹40,000. సీనియర్ లెవల్లో నెలకు ₹1 లక్ష పైమాటే.
- గ్రాఫిక్ డిజైనింగ్: సృజనాత్మకతకు సిరి సంపదలు!
లోగోలు, పోస్టర్లు, యాడ్స్ డిజైన్ చేయడంపై ఆసక్తి ఉంటే ఈ కోర్స్ బెస్ట్. ఫ్రీలాన్సర్‌గా కూడా లక్షలు సంపాదించవచ్చు.
ఫీజు: ₹15,000 నుండి ₹80,000.
ఆదాయం: ఫ్రీలాన్సింగ్‌లో ఒక్కో ప్రాజెక్టుకు ₹50,000 వరకు డిమాండ్ చేయవచ్చు.
- ఏవియేషన్ & ఎయిర్ హోస్టెస్: ఆకాశమే హద్దు!
ప్రయాణాలు అంటే ఇష్టపడే వారికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ఇది గ్లామరస్ కెరీర్.
జీతం: ప్రారంభంలోనే నెలకు ₹40,000 నుండి ₹80,000 వరకు ఉంటుంది.
- హోటల్ మేనేజ్మెంట్: హాస్పిటాలిటీలో రారాజులు!
రిసార్టులు, ఫైవ్ స్టార్ హోటళ్లు లేదా విదేశీ క్రూయిజ్ షిప్పులలో ఉద్యోగాలు దక్కుతాయి.
అవకాశం: విదేశీ ఉద్యోగాల్లో నెలకు లక్షల్లో జీతం అందుకోవచ్చు.
- నర్సింగ్ (ANM/GNM): వైద్య సేవలో ఉన్నత కెరీర్!
మెడికల్ ఫీల్డ్‌లో త్వరగా సెటిల్ అవ్వడానికి ANM (2 ఏళ్లు), GNM (3 ఏళ్లు) కోర్సులు ఉత్తమం.
జీతం: ప్రారంభంలోనే ₹20,000 నుండి ₹40,000 వరకు లభిస్తుంది.
- డేటా ఎంట్రీ & ఆఫీస్ అడ్మిన్: సులభమైన దారి!
కేవలం 3-6 నెలల్లో కంప్యూటర్, ఎక్సెల్ నైపుణ్యాలు నేర్చుకుని ఆఫీస్ జాబ్స్ సంపాదించవచ్చు.
ఫీజు: కేవలం ₹10,000 నుండి ₹30,000.
- ఫ్యాషన్ డిజైనింగ్: స్టైలిష్ కెరీర్!
దుస్తుల డిజైనింగ్, ఫ్యాషన్ షోలపై ఆసక్తి ఉన్నవారికి NIFT వంటి సంస్థల్లో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది.
ఆదాయం: సొంత బ్రాండ్ ప్రారంభిస్తే నెలకు లక్షల ఆదాయం గ్యారెంటీ.
- ఐటీఐ (ITI) – టెక్నికల్ కోర్సులు:
ఎలక్ట్రీషియన్, మెకానిక్ వంటి టెక్నికల్ స్కిల్స్ ఉన్నవారికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 1-2 ఏళ్ల కోర్సుతో రైల్వేస్ లేదా ప్రైవేట్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వొచ్చు. - డి.ఫార్మసీ (D.Pharm): మెడికల్ షాప్ & ఫార్మా రరంగం!
డాక్టర్ చదవలేకపోయినా, మెడికల్ లైన్లో ఉండాలనుకునే వారికి ఈ 2 ఏళ్ల కోర్సు వరం. స్వయంగా మెడికల్ స్టోర్ కూడా నిర్వహించుకోవచ్చు.
