ఇంతమంది ఎదురుచూస్తున్న ‘బేబీ’ సినిమా ఎలా ఉందంటే?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘బేబీ’. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మాణ సారథ్యంలో సాయిరాజేశ్ దర్శకత్వంలో ‘బేబీ’ తెరకెక్కింది. ఈ చిత్రం (జులై 14) గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

బేబీ సినిమాని చాలా పచ్చిగా ఈ సినిమా తీసాడు దర్శకుడు సాయి రాజేష్.బయట పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని సీన్స్ మాత్రం అదిరిపోయాయి.ఈ క్రమంలో కొన్ని సీన్స్ సూపర్ గా వర్కవుట్ అయ్యాయి.. ఇంకొన్ని ఆకట్టుకోలేదు.ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా వెళ్తుంది. స్క్రీన్ ప్లే కూడా అంతే స్లో.

ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాకే హైలైట్.. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్. నిజమైన ప్రేమకి, బలహీనతకి మధ్య నలిగే పాత్రను అందంగా రాసుకున్నాడు దర్శకుడు.దాన్ని అంతే అందంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది వైష్ణవి చైతన్య.ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది.క్లైమాక్స్ కూడా హార్డ్ రియాలిటీ ట్రై చేసాడు దర్శకుడు. ఓవరాల్ గా బేబీ.. యూత్ కి నచ్చడం ఖాయం.

వాస్తవానికి బడ్జెట్ పరంగా చూస్తే ‘బేబీ’ చిన్న సినిమానే. కానీ, సినిమాకు లభించిన హైప్ చూస్తే ఏ భారీ బడ్జెట్ సినిమాకు తీసిపోని రీతిలో ఉంది. బిజినెస్ బాగానే జరిగినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.


Posted

in

by

Tags: