“ఇకపై అందరి జీవితాలు మారిపోబోతున్నాయి..!” 24 గంటలూ మీకోసం పనిచేయనున్న ఏఐ (AI).. ఐదేళ్లలో రాబోతున్న పెను మార్పు.. మార్క్ జుకర్‌బర్గ్ సంచలన అంచనా..!!

రాబోయే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు తమకంటూ సొంతంగా ‘పర్సనల్ ఏఐ ఏజెంట్లను’ (కృత్రిమ మేధ సహాయకులను) కలిగి ఉంటారని మెటా (Meta) సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అంచనా వేశారు.

సంస్థ త్రైమాసిక ఆదాయ సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ ఏఐ ఏజెంట్లు యూజర్ల లక్ష్యాలను అర్థం చేసుకుని, వారి కోసం రోజులో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా డబ్బు, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు, ఇంటి నిర్వహణ వంటి కీలక విభాగాల్లో ప్రజలకు ఈ ఏఐ వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ప్రజలు ఒకే సమయంలో అనేక ఏఐ ఏజెంట్లతో సంభాషించడం ప్రారంభించినప్పుడు.. వాట్సాప్ (WhatsApp) తో సహా మెటాకు చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ సేవలు సంస్థకు అతిపెద్ద ఆదాయ వనరుగా మారతాయని, టెక్సాస్‌లో 14 బిలియన్ డాలర్ల వ్యయంతో భారీ డேటా సెంటర్‌ను నిర్మించే పనుల్లో మెటా నిమగ్నమై ఉందని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *