“ఇకపై ప్రభుత్వం అనుకున్నా ఇంటర్నెట్‌ను నిలిపివేయలేదు!”.. ఇరాన్‌లోకి చొచ్చుకెళ్లిన ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్.. అంతర్జాతీయ రాజకీయాలోనే తీవ్ర కలకలం..!!

ప్రపంచ అగ్రశ్రేణి శతకోటీశ్వరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్టార్‌లింక్’ (Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు, ఇరాన్ వంటి దేశాల కఠినమైన ఆంక్షలను సైతం దాటుకుని నేరుగా ఆ దేశంలోకి ప్రవేశించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వాల సెన్సార్‌షిప్ (సమాచార నియంత్రణ) మరియు ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల వంటి చర్యలను పక్కనపెట్టి పనిచేసే ఈ అత్యాధునిక సాంకేతికత, భవిష్యత్తులో దేశాల సార్వభౌమత్వానికే పెద్ద సవాలుగా పరిణమిస్తుందనే ఆందోళన నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

ఇరాన్ ప్రభుత్వం తన పౌరులకు ఇంటర్నెట్ సేవులపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసి కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ పరికరాల ద్వారా ఏ దేశపు స్థానిక టెలికాం టవర్ల సహాయం లేకుండానే, నేరుగా అంతరిక్ష ఉపగ్రహాల (Satellites) ద్వారా లబ్ధిదారులు వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందగలుగుతున్నారు.

దీనివల్ల ప్రభుత్వ నియంత్రణలతో సంబంధం లేకుండా ప్రజలు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడమే కాకుండా, ప్రపంచంతో అటకాయంపులు లేకుండా కనెక్ట్ కాగలుగుతున్నారు. ప్రభుత్వాలు దేనినీ పర్యవేక్షించలేవు లేదా నిలిపివేయలేవు కాబట్టి, ఈ రహస్య ఇంటర్నెట్ వ్యవస్థ అక్కడి పాలకులకు నిద్రలేకుండా చేస్తోంది.

ఒక దేశ సరిహద్దుల్లోకి ఏ సమాచారం రావాలో, దేనిని నిషేధించాలో నిర్ణయించే సార్వభౌమాధికారాన్ని ఈ శాటిలైట్ టెక్నాలజీ పూర్తిగా ప్రశ్నించేలా చేసింది.

రేపు ఎలాన్ మస్క్ అనుకుంటే ఏ దేశపు డిజిటల్ వ్యవస్థనైనా ఆ ప్రభుత్వ అనుమతి లేకుండానే తలకిందులు చేయగలరనే పరిస్థితి ఏర్పడింది. ఈ సాంకేతిక అభివృద్ధి మానవుని స్వేచ్ఛను పునరుద్ధరిస్తోందా లేదా దేశాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందా అనే అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *